ఆ జబ్బు వచ్చినప్పుడు సినిమాలు మానేద్దామనుకున్నాను: కాజల్‌

16:17 - December 5, 2018

సినిమాల్లో ఎంతో అందగా కనిపిస్తూ, చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ వుండే హీరోయిన్లకు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలూ వుంటవంటే పొరపాటే...ఇదేంటి అనుకుంటున్నారా అవునండీ..గతంలో కూడా కొంతమంది హీరోయిన్స్‌కు పెద్ద జబ్బులు వచ్చిన సంగతి తెలిసిందే. డిప్రెషన్ వల్ల ఒక దశలో ఎంతగా ఇబ్బంది పడ్డానో దీపికా పదుకొనే చెప్పడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ మధ్యే ప్రియాంక చోప్రా సైతం పెళ్లి చేసుకునేముందు తన ఆరోగ్య సమస్యల గురించి వెల్లడించింది. తాజాగా మన చందమామ కాజల్ అగర్వాల్ తాను ఎదుర్కొన్న పెద్ద అనారోగ్య సమస్య గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది. తాను కొన్ని నెలల కిందట ఆటో ఇమ్సినో అనే జబ్బు బారిన పడినట్లు తెలిపింది. ఇలాంటి జబ్బు ఒకటుందని కూడా తనకు అప్పటిదాకా తెలియదని కాజల్ వెల్లడించింది. ప్రతి రోజూ రాత్రి తనకు జ్వరం వచ్చేదని.. దానికి కారణమేంటో తెలిసేది కాదని ఆమె చెప్పింది. తర్వాత వైద్య పరీక్షలు చేయించుకుంటే ఈ జబ్బు ఉన్నట్లు తేలిందని తెలిపింది. దీంతో మూడు నెలల పాటు ఇంటి పట్టునే ఉండి చికిత్స తీసుకున్నానని.. పూర్తిగా జబ్బు నయం అయ్యాక మళ్లీ బయటికి వచ్చానని వెల్లడించింది. ఈ జబ్బు గురించి తెలిశాక ఇక సినిమాలే మానేద్దామన్న ఆలోచన కూడా వచ్చిందని.. కానీ కోలుకున్నాక ఆ ఆలోచన పోయిందని.. వరుసగా అవకాశాలు రావడంతో సినిమాలు చేసుకుంటూ పోతున్నానని కాజల్ వెల్లడించింది. ‘కవచం’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన ఆమె ఈ విషియాలని వెల్లడించింది.