ఆ ఒక్క మాటతో..కొండంత అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు

10:43 - October 29, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మంచు మనోజ్‌ని ట్విటర్ ద్వారా ఓ ప్రశ్న అడగ్గా.. ఆయన ఇచ్చిన రిప్లై చూసిన అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అసలు విషియానికి వస్తే... ఓ నెటిజన్ ' మనోజ్ భయ్యా ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పు' అనగా.. ' నా ప్రాణం ' అని సింపుల్‌గా బదులిచ్చి కొండంత అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. గతంలో కూడా ఎన్నో సార్లు తారక్‌పై మనోజ్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. చిన్నతనంలో స్కూల్లో తారక్‌ను ఎవరో ఏదో అన్నారని వెళ్లి అతని చెయ్యి విరగ్గొట్టి వచ్చాడట మనోజ్. ఇది తెలుసుకున్న అభిమానులు పొంగిపోయారు. ఇటీవల నందమూరి హరికృష్ణ మరణ సమయంలో కూడా ఎన్టీఆర్‌కు మనోజ్ బౌన్సర్‌లా మారి ఆయన అభిమానుల నుంచి అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు.