ఆస్తుల వివాదంలో..మళ్ళీ తెరపైకి దాసరి కుటుంబం

15:00 - September 11, 2018

ఆస్తుల వివాదంలో మళ్ళీ దాసరి కుటుంబం తెరపైకి వచ్చింది. దాసరి గారి పెద్దబ్బాయి ప్రభు సతీమణి సుశీల కొడుకుతో సహా ఆయన స్వగృహం ముందు బైఠాయించి ఆస్తుల పంపకాల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ ధర్నాకు దిగడం సంచలనంగా మారింది. దాసరి గారు బ్రతికిఉన్నప్పడే తమకు న్యాయం చేస్తామని మాట ఇచ్చారని కానీ అనారోగ్యం వల్ల అకాల మరణం చెందటంతో తమను ఆదుకునే వారు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఆస్తులన్నీ రెండో అబ్బాయి దాసరి అరుణ్ కుమార్ ఆధీనంలో ఉండటం వల్ల వాటాల పంపిణి జరగలేదని సుశీల ఆరోపణ.  ఇది తెలుసుకున్న దాసరి అభిమానులు కలత చెందుతున్నారు. అందరికి న్యాయం చేసి మంచి చెప్పిన దాసరి కుటుంబం ఇలా ఆస్తుల వివాదంలో వీధుల్లోకి రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

దాసరి చిన్న కుమారుడు అరుణ్‌ కుమార్‌ సినిమాల్లో హీరోగా నటించిన విషియం అందరికీ తెలిసిందే. అయితే సినిమల్లో ఎక్కువ కాలం కొనసాగలేక అరుణ్‌ వ్యాపారాల్లోకి వెళ్లిపోయారు.  ఇప్పుడు ఈ వివాదంతో మరోసారి తెరపైకి వచ్చాడు అరుణ్. దాసరి ప్రభుకు అరుణ్ కు వాటాల విషయంలో దాసరి నారాయణరావు గారు ఏమైనా వీలునామా రాశారా లేదా అనే దాని గురించి ఇరు వర్గాల న్యాయవాదులు సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. కానీ అసలు విషయం మాత్రం బయటికి రావడం లేదు. ఇప్పుడున్న ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా చొరవ తీసుకుని పరిష్కారం కోసం నడుం బిగిస్తే బాగుంటుంది.