ఆసక్తి రేకెత్తిస్తున్న ' సూర్యకాంతం ' ఫస్ట్‌లుక్‌

12:37 - December 18, 2018

నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న 'సూర్యకాంతం'  నుంచి నాయకా నాయికల ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో రాహుల్ విజయ్ జోడీగా నిహారిక హీరోయిన్‌గా కనిపించనుంది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో... కథానాయకుడిని ఆరాధనా పూర్వకంగా చూస్తూ .. ఆ తరువాత ఆయనని టార్చర్ పెడుతూ ఈ పోస్టర్లో నిహారిక కనిపిస్తోంది. కొత్త సంవత్సరం ఆరంభంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు. ఎందుకంటే... 'ఒక మనసు' వంటి సున్నితమైన ప్రేమకథా చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నిహారిక, ఇటీవలే 'హ్యాపీ వెడ్డింగ్' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోను చేసింది. అయితే ఈ సినిమా కూడా ఆదరణ పొందలేదు.