ఆలస్యంగా వెలువడనున్న ఎన్నికల ఫలితాలు...అభ్యర్థుల్లో పెరుగుతున్న ఉత్కంఠ

15:16 - December 10, 2018

డిసెంబర్‌ 7న తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఫలితాల కోసం అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు వేచి చూస్తున్నారు. అయితే ఈ రిజల్ట్‌ డిసెంబర్‌ 11న అంటే రేపు (మంగళవారం) విడుదలవుతాయని అందరికీ తెలిసిన విషియమే. కానీ ఎన్నికల ఫలితాలు ఆలస్యం కానున్నాయట!. దీంతో అభ్యర్థులో ఇప్పుడున్న దానికన్నా ఉత్కంఠ పెరిగిపోతుంది. వివరాల్లోకి వెలితే...గతంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో ప్రతీ రౌండ్ ఫలితాలు వెంటనే బయటకు ప్రకటించేవాళ్లు. ఈసారి ఎన్నికల కమిషన్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఫలితాలు ఆలస్యం కానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం ప్రతీ రౌండ్ ఫలితాన్ని స్టేట్ మెంట్ రూపంలో ముందు పోటీచేసిన అభ్యర్థులకు ఇస్తారు. వారు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోతే దానిపై రిటర్నింగ్ అధికారి సంతకం చేసి మీడియాకు ఇస్తారు. అంతేకాకుండా ఆ రౌండ్ ఫలితాన్ని వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తారు. ఇలా ప్రతీ రౌండ్ ఫలితం స్టేట్ మెంట్ రూపంలో పెట్టిన తర్వాతే ఫలితం ప్రకటిస్తారు. దీంతో చివరి ఫలితం గతంలో కంటే మరో రెండు గంటల ఆలస్యం అవచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ప్రతీ రాష్ట్రంలో ఈ నిబంధన మంగళవారం నుంచి ఎన్నికల అధికారులు అమలు చేయనున్నారు.