' ఆర్‌ఆర్‌ఆర్‌ ' సెట్‌ ఇదేనట!

11:58 - November 23, 2018

రాజమౌళి ఒక సినిమా టేకప్ చేశాడంటే ప్రేక్షకులకు దానిపై ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు రామ్‌ చరణ్‌, తారక్‌తో తీస్తున్న ' ఆర్‌ఆర్‌ఆర్‌ 'పై ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు జక్కన్న భారీ సెట్లు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో ఒక సెట్‌ ఫోటో బయటకు వచ్చింది. మనకు ఫోటోలో కనిపిస్తుంది ఆ సెట్టేనట!. ఈ  సెట్ నిర్మాణం ప్రస్తుతం సీబీఐటీ కాలేజీకి సమీపంలో జరుగుతోందట. ఈ సెట్ వాలకం చూస్తుంటే బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ అనే అనిపిస్తోంది.  #RRR కథ స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి కాబట్టి ఈ సెట్ నిర్మాణం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఇప్పటికే ఈ సెట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.  కథ వివరాలు సెట్లకు సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా రాజమౌళి అండ్ టీం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయిగానీ వాటితో సంబంధం లేకుండా ఈ సెట్ ఫోటోలు లీక్ కావడం విచిత్రమే.