' ఆర్‌ఆర్‌ఆర్‌ ' ప్రారంభానికి డేట్‌ ఫిక్స్‌

12:53 - November 3, 2018

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్తో దర్శకధీరుడు రాజమౌళి..చేయబోతోన్న ' ఆర్‌ఆర్‌ఆర్‌ ' మూవీ ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ చేశారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం ఓ స్పెషల్ తేదీన ప్రారంభం కాబోతోంది. 11- 11 -11న ఈ చిత్రం ప్రారంభం కానుంది. 11వ నెల 11వ తారీఖు 11గంటలకు ఈ చిత్రానికి ముహూర్తంగా ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ విడుదల చేసింది. ఇందులో ' 11 11 11 '  అని చూపిస్తూ.. ఈ మూడు 11లు మూడు ' R R R 'లుగా మారడంను వీడియోలో చూపించారు.