ఆమె సినిమాలు ఫ్లాప్‌...అయినా ఆమె లక్కీనే...

13:41 - September 30, 2018

ఇండ్రస్టీలో హీరో , హీరోయిన్స్‌ తీసిన రెండు మూడు సినిమాలు ఫ్లాప్‌ అయితే ...ఇక వాళ్లకి ఐరన్‌ లెగ్‌ ముద్ర వేస్తారు. అయితే ఇక్కడ అలా జరగలేదు. అందుకు భిన్నంగా బంపర్‌ ఆఫర్స్‌ వచ్చాయి ఆ హీరోయిన్‌కి. మరి ఆ హీరోయిన్నే  లక్కీ బ్యూటీ మేఘా ఆకాష్.  లక్కీ అంటే.. ఆమె లక్కీ  అని.. ఆమెను సినిమాకు తీసుకున్నవాళ్లు కాదు..!.  మేఘా ఆకాష్ కు స్టార్టింగ్ లోనే 'ఎన్ని నొక్కి పాయుం తొట్ట' అనే ధనుష్ సినిమాలో అవకాశం వచ్చింది.  మేఘ ను చూసి ఇంప్రెస్ అయిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఆ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు.  ఆ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపు మూడేళ్ళయినా  సినిమా మాత్రం విడుదల కావడం లేదు. ఇక తెలుగులో నితిన్ సినిమాలు రెండు చేసింది.  'లై'.. 'చల్ మోహన్ రంగ'.  రిజల్ట్ సంగతి చెప్పేదేముంది..దొందూ దొందే. ఇలా డిజాస్టర్స్ వస్తే హీరోయిన్స్ కు ఐరన్ లెగ్ ముద్ర వేస్తారు. కానీ మేఘ కు మాత్రం అలా జరుగుతున్నట్టు కనిపించడం లేదు.  ఏకంగా రజనీకాంత్ 'పెట్టా' లో పడింది. అంతే కాదు.. హిందీలో ఆదిత్య పంచోలి హీరోగా తెరకెక్కనున్న బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. దీన్ని బట్టి ఏమర్దంచేసుకోవాలి?...ఆమెకు టన్నులు, టన్నులు లక్కుందనే కదా.