ఆమె కవితల్లో పవన్‌ ప్రస్తావన లేదెందుకో?

16:54 - December 10, 2018

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్లో మంచి కవయిత్రి ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో కవితలను పోస్ట్ చేసే రేణు ఫైనల్ గా వాటికి ఒక పుస్తక రూపాన్ని ఇచ్చింది. ఏ లవ్ ఆన్ కండీషనల్ పేరుతో పబ్లిష్ చేసిన ఆ బుక్ ని తెలుగులో అనంత శ్రీరామ్ సహాయంతో అనువాదం చేయించింది రేణు.  అయితే కవితలను చదివాకా అందరికి కలిగిన అభిప్రాయం ఏంటంటే అందులో అణుమాత్రం పవన్ కళ్యాణ్ ప్రస్తావన కానీ అతనితో ఉన్న పన్నెండేళ్ల అనుబంధం గురించిన విశేషాలు కానీ ఏమి లేవట. కేవలం ప్రేమ గురించిన ఫీలింగ్స్ మాత్రమే అందులో ఉన్నాయి. అయితే రేణు దేశాయ్ ఓ పుస్తకం రాసింది కాబట్టి అందులో పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఉండి తీరాలన్న రూల్ ఏమి లేదు. పైగా విడిపోయి ఉన్నారు. ఎవరికి వారు వ్యక్తిగత జీవితాన్ని కావాల్సిన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటప్పుడు రేణు బుక్ లో పవన్ గురించి ఎందుకు లేదు అనే సందేహం వెలిబుచ్చడం సరికాదు. అయితే పవన్ ఫ్యాన్స్ ఆ మధ్య జానీ షూటింగ్ లో వర్కింగ్ స్టిల్ ని షేర్ చేసుకున్న సంగతిని గుర్తు చేస్తున్నారు. అసలు పవన్ పేరే రాకూడదు అనుకున్నప్పుడు ఆ పిక్ ని ఎందుకు పోస్ట్ చేసినట్టు అని గుర్తు చేస్తున్నారు.