ఆమెకు అందుకే అవకాశాలు రావట్లేదంట!

17:56 - October 23, 2018

మలయాళ హీరోయిన్ భావనను కిడ్నాప్ చేసి లైంగికంగా వేదించిన కేసులో నటుడు దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. బెయిల్ పై బయటకు వచ్చిన దిలీప్ ను మళ్లీ మలయాళ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ (అమ్మ)లోకి తీసుకోవడంపై కొందరు నిరసన వ్యక్తం చేశారు. దిలీప్ కు వ్యతిరేకంగా గళం ఎత్తిన వారిలో హీరోయిన్ పార్వతి కీలక పాత్ర పోషించారు. దిలీప్ ను అమ్మలోకి తీసుకోవడంతో కొందరు ప్రత్యేకంగా సంఘంను పెట్టుకున్నారు. ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారట. ఆ సంఘంలో సభ్యులుగా ఉన్న వారికి మలయాళ సినిమాల్లో ఆఫర్లు రాకుండా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారట. తాజాగా పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. నేను ప్రస్తుతం ఒకే ఒక్క సినిమాలో నటిస్తున్నాను ఆ తర్వాత నాకు ఛాన్స్ లు వస్తాయనే నమ్మకం లేదు. ఇక నేను ప్రతి రోజు కూడా భయంతో బతికేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో మీటూ అంటూ ఆరోపణలు చేస్తున్న వారికి అక్కడ ప్రముఖుల నుండి మద్దతు లభిస్తుంది. కాని మాలీవుడ్ లో మాత్రం పరిస్థితి వేరుగా ఉందని పార్వతి ఆవేదన వ్యక్తం చేసింది.