అసలు విషియం చెప్పిన అనుష్క

11:23 - October 30, 2018

అనుష్క బరువు ఎక్కువగా పెరగడంతో ఆమె ఈ మధ్య సినిమాల్లోకి రావడంలేదు. అయితే ఈనేపథ్యంలో అనుష్క నుంచి ఏ పిక్‌ వచ్చినా కానీ అది పెళ్లికి సంకేతాలా? అన్నట్లుగా నెట్టింటిలో అందరూ చర్చ జరపడం జరుగుతుంది. తాజాగా ఇలాంటిది ఒకటి జరిగింది. రెండు రోజుల క్రితం అనుష్క సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో బాగా వైరల్ అయింది. దీనికి కారణం ఆమె ఆకు మెట్టెకు సంబంధించిన పిక్‌ను పోస్ట్ చేసింది. ఇంకేముంది అనుష్కకు సినిమాల్లేక పోవడంతో పెళ్లికి సిద్ధమైపోయిందంటూ నెట్టింట్లో రచ్చరచ్చ అయింది. దీంతో మళ్లీ అనుష్క క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. ఈ బొద్దుగుమ్మ బరువు తగ్గేందుకు నార్వేలోని ఓ ప్రకృతి వైద్యశాలలో చేరింది. ఈ వైద్యశాలలో నాచురోపతి ట్రీట్‌మెంట్ ద్వారా బరువు తగ్గిస్తారు. దట్టమైన అడవుల్లో ఉండే ఈ వైద్యశాలలో ఖాళీ సమయాల్లో సరదాగా తిరుగుతూ ఉండగా తన కాలికి తగిలిన తీగను ఫోటో తీసి పోస్ట్ చేసిందట.