అసలుసిసలైన పందెంకోడిలా వరూ...

14:50 - October 10, 2018

ఈ దసరా బరిలో తెలుగు సినిమాలతో పోటీపడుతూ విశాల్ `పందెంకోడి 2` రిలీజ్ కి రెడీ అవుతోంది. మొన్ననే రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇది ఆరంభం మాత్రమే.. ముందుంది ముసళ్ల పండగ అని విశాల్ సవాల్ విసిరాడు. ఈ సినిమాలో నన్ను మించిన పందెంకోడి మై  డాళింగ్ వరూ! అంటూ హింట్ కూడా ఇచ్చాడు. ఈసారి పందెంకోడి 2 చిత్రాన్ని వరలక్ష్మి శరత్ కుమార్ కోణంలో చూడాలని ముందే చెప్పారు కాబట్టి అందుకు తగ్గట్టే వరూ ప్రకంపనాల్ని ప్రచారానికి బాగానే వాడేస్తోంది టీమ్. అసలు సిసలు పందెంకోడి ఈవిడే చూడండి! అంటూ సామాజిక మాధ్యమాల్లో కొత్త పోస్టర్లను తాజాగా రివీల్ చేశారు. ఈ పోస్టర్లలో వరలక్ష్మి ఎక్స్ ప్రెషన్స్ కెవ్వు కేక. మెల్లకన్ను.. తిప్పుతూ వరూ కొత్త ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. చీరకట్టులోనే తాట ఒలిచింది. తెలంగాణ శకుంతలకు వారసురాలిలాగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే నీలాంబరి తర్వాత ఈవిడేనా? అన్న సందేహాల్ని రేకెత్తిస్తోంది. టాలీవుడ్ స్క్రీన్పై సరికొత్త విలనీ చూడబోతున్నామన్న భరోసాని ఇస్తోంది. విశాల్ - కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి విలనీ హైలైట్ గా ఉండనుంది. ఈ సినిమా దసరా రోజు 18న రిలీజ్‌ కానుంది. అదే రోజు రిలీజవుతున్న రామ్ `హలో గురూ ప్రేమకోసమే` చిత్రానికి `పందెంకోడి- 2` ఠఫ్ కాంపిటీషన్ ఇవ్వనుంది