అసమ్మతి నేతలను వదిలేయండి : కేసీఆర్‌

13:07 - October 1, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెరతీశారు. దీంతో అసెంబ్లీని రద్దు చేసినవెంటనే, 105 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను వెల్లడించడం జరిగింది. అదుగో అప్పుడు మొదలైంది...టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగ. ఈ నేపథ్యంలోనే తాజాగా కొండా సురేఖ, బాబూ మోహన్‌, టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు.గత కొన్ని రోజులుగా ఈ అసమ్మతి నేతలను కేటీఆర్‌  బుజ్జగించే పనిలోనే వున్నట్లు సమాచారం.  వీరంతా తెలంగాణ అదిష్టానంపై తీవ్ర అసంతృప్తితో వున్నారు.  ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితీదే విజయమని - గెలుపు తర్వాత భంగపడ్డ నాయకులకు కోర్పరేషన్ - ఎమ్మెల్సీ పదవులను తాయిలాలుగా చూపించి బుజ్జగిస్తున్నారు. అయితే తాయిలాలకు లొంగని నాయకులను పట్టించుకోవద్దంటూ తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశించినట్టు సమాచారం. అయినప్పటికీ... ఇటు వంటి అసమ్మతి నాయకుల కదలికలపై ఎప్పటికప్పుడు కెసీఆర్ ద్రుష్టి పెడుతున్నాట్లు సమాచారం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసమ్మతి నాయకుల గూర్చి పట్టించుకోకుండా - ఆ నియోజకవర్గాలలో గెలుపు కోసం ఎక్కువగా ద్రుష్టి పెట్టాలని కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన పలు అభివ్రుద్ది కార్యక్రమాలు గడప గడపకి తీసుకుని వెళ్లాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. చివరిసారిగా అసమ్మతి నేతలతో మరోసారి మాట్లాడాలని - అప్పటికి వినకపోతే వారి కర్మనా వారిని వదిలివేయండి అని కెసీఆర్ అన్నట్లు సమాచారం. టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలు తమ నాయకుడైన కెసీఆర్ కు అనుకూలంగా ప్రచారం చేస్తూనే - తమ నియోజకవర్గ అభ్యర్దిపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. కొంతమంది అభ్యర్దులు స్వతంత్రంగా పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ముక్తల్ వంటి నియోజకవర్గలలో తెరాస అభ్యర్దియైన రాంమోహన రెడ్డి మార్చాలంటూ నిన్న ఆదివారం నాడు ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయడం గమనార్హం.