అల్లూ అర్జున్‌ నెక్స్ట్‌ సినిమా అదేనా?

13:39 - November 16, 2018

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఈ మద్య సినిమాలకు చాలా గ్యాప్‌ తీసుకున్నారు. ఎప్పుడు దీని గురించి అడిగినా దాటేసుకుంటూనే వస్తున్నారు. ఇటీవల ' టాక్సీవాల ' ప్రీ-రిలీజ్‌ ఈవెంట్ లో అభిమానులు అడుగుతూ గోల చేస్తే 'తెలీదు బ్రదర్' అని చెప్పి తప్పించుకున్నాడు. ఈమధ్య తమిళంలో విజయ్ సేతుపతి-త్రిష జంటగా నటించిన చిత్రం '96' విడుదలై ఘనవిజయం సాధించింది. ప్రేక్షకాదరణతో పాటుగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.  టీవీ లో ప్రసారం అయిన తర్వాత కూడా థియేటర్లలో మంచి కలెక్షన్స్ నమోదు చేస్తూ సంచలనం సృష్టించింది.  ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ దిల్ రాజు తీసుకున్నారట. స్టైలిష్ స్టార్ ఈమధ్యనే ఈ సినిమాను చూసి మనసు పారేసుకున్నారట. తెలుగులో ఈ సినిమా రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉండడంతో '96' దర్శకుడు ప్రేమ్ కుమార్ ను దిల్ రాజు లైన్లోకి తీసుకొచ్చాడట. తెలుగు నేటివిటీకి  సూటయ్యేలా కొన్ని మార్పులు చేయమని ప్రేమ్ కుమార్ కు చెప్పాడట అల్లు అర్జున్.  అంతా సవ్యంగా జరిగితే స్టైలిష్ స్టార్ నెక్స్ట్ సినిమా ఇదే అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం.