అలోక్‌ వర్మ పిటీషన్‌పై సుప్రీం సంచలన నిర్ణయం

12:17 - October 26, 2018

సీబీఐ చీఫ్‌ అలోక్‌ వర్మ పిటీషన్‌ పై సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. విధుల్లోంచి తనను తప్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అలోక్‌వర్మ సవాలు చేయడంతో దీనిపై సీజేఐ రంజన్ ‌గొగోయ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో సీవీసీ ఈ విచారణ చేపట్టాలని అత్యున్నత న్యాయస్థానం తమ ఆదేశాల్లో పేర్కొంది. తాత్కాలిక సీబీఐ చీఫ్‌గా నియమితులైన ఎం నాగేశ్వరరావు ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోరాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. రొటీన్ విధులు మాత్రమే ఆయన చేపట్టాలని, ఇన్వెస్టిగేషన్ అధికారిని సీబీఐ మార్చడంపై సీల్డ్ కవరులో నవంబర్ 12లోగా కోర్టుకు సమర్పించాలని కూడా సీజేఐ రంజన్ గొగోయ్ ఆదేశించారు. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మకు సంబంధించి సెక్రటేరియట్ నోట్‌లో పేర్కొన్న ఆరోపణలపై ఇవాల్డి నుంచి రెండు వారాల్లోగా ఎంక్వయిరీ పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.