' అర్జున్ రెడ్డి 'కి కత్తెర వేటు

విజయ్ దేవర కొండ హీరోగా చిత్రించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా ఎంతగా ప్రేక్షకుల్లోకి వెళ్లిందో మనందరికీ తెలిసిన విషియమే. అయితే ఈ సినిమాలో... కంటెంట్‌తోపాటు హీరో యాక్టింగ్, సినిమా డ్యూరేషన్ కూడా అరాచకమే. మామూలుగా సినిమా రెండున్నర గంటలంటేనే వామ్మో అనుకునే పరిస్థితి. అయితే అర్జున్ రెడ్డి విడుదలకు ముందు ఈ సినిమా మూడున్నర గంటలు అంటే విన్న వారందరికీ గుండెలు గుభేలుమన్నాయి. కానీ సినిమా చూసినాక మాత్రం అందరూ సినిమాకు అంత సమయం అవసరమే అని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా తమిళంలో రాబోతుంది.
తమిళంలో విక్రమ్ కుమారుడు ధృవ హీరోగా బాలా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్ 'వర్మ'. కొత్త హీరో దానికి తోడూ డెబ్యూ సినిమా కాబట్టి ల్యాగ్ అనిపించకుండా క్రిస్ప్ గా చేసే ప్రయత్నాలలో మేకర్స్ ఉన్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో 'వర్మ' సినిమా కు మూడు గంటల నిడివి మాత్రం ఉండదు. మరి రీమేక్ లో ఏ సీన్స్ కు కత్తెర వేటు పడుతుందో వేచి చూడాలి. ఈ సినిమాకు రాదన్ సంగీత దర్శకుడు. మేఘ చౌదరి ఈ సినిమాలో షాలిని పాండే పాత్ర పోషిస్తోంది. సెప్టెంబర్ 23న ధృవ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఆడియో రిలిజ్ చేస్తారట.