' అరవింద సమేత 'కు యూ/ఏ సర్టిఫికెట్‌

12:44 - October 9, 2018

జూనియర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కిన చిత్రం ' అరవింద సమేత '. ఈ చిత్రానికి సెన్సార్‌ యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వడం జరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సర్టిఫికెట్‌ జారీ చేసిన వెంటనే చిత్ర యూనిట్‌...కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. సర్టిఫికెట్‌ జారీ చేసిన వెంటనే చిత్ర యూనిట్‌...కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ఈ చిత్రం రిలీజ్‌ కు ఇంకా రెండు రోజులే టైం వుంది. దీంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింతగా పెరిగింది. దసరా కానుకగా వస్తున్న ఈ చిత్రలో ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకులనుండి భారీ స్పందన లభించింది.