' అరవింద సమేత ' కు అనుకోని షాక్‌...

15:55 - October 11, 2018

అంతా బాగానే వుంది, అనుకున్న టైంకి రిలీజ్‌ చేసిన ' అరవింద సమేత 'కు ఇప్పుడు పైరసీ షాక్‌ తగిలింది. అర్ధరాత్రి 12.30 తర్వాత మొట్టమొదటి షో పడుతూనే ఇదిగో తాను అరవింద సమేత చూస్తున్నానంటూ కొందరు కొన్ని స్క్రీన్ షాట్లు పలు ఫైట్ సీన్లను వీడియో తీసి ఆన్ లైన్ లో పెట్టేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాహుబలి మూవీ సమయంలోనూ ఇలా తమిళనాడులో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అవి సినిమాకు తీవ్ర దెబ్బగా మారింది. ఆ తర్వాత రంగస్థలం - భరత్ అనే నేను సినిమాలకు ఇదే దెబ్బ పడింది. ఇప్పుడు అరవింద సమేతకు అదే పరిస్థితి ఎదురైంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత కట్టడి చేస్తున్నా సరే.. ఇతర హీరోల అభిమానులు  ఈ వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెడుతున్నట్టు సమాచారం.  జూనియర్‌ ఎన్టీఆర్‌ ఈ సినమా సమయంలో ఎంతో కష్టాన్ని కూడా దిగమింగుకోని, సినిమాను అనుకున్న టైంకి అందించాలని షఉట్‌ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు దానికి తగ్గ ఫలితం వస్తుందా? లేదా ఈ పైరసీ శాపానికి బలవుతుందో? చూడాలి.