' అమ్మ ' క్యారెక్టర్‌లో నేనే అంటున్న మళయాలం ముద్దు గుమ్మ

15:10 - November 10, 2018

మలయాళం నటి నిత్య మీనన్ కు మొదటి నుండి తన నటనతో కట్టిపడేయడం అలవాటే.  అందుకే కాస్త వెయిట్ పెరిగి బొద్దుగా కనిపిస్తున్నా తనకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా 'అమ్మ' జయలలిత బయోపిక్ చేస్తున్నానంటూ కన్ఫాం చేసింది. ఈమధ్య ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి వెల్లడించింది నిత్య.  అందులో జయలలిత బయోపిక్ 'ది ఐరన్ లేడీ' కూడా ఉందని చెప్పింది. ఈ సినిమాతో పాటు నిత్య ఎన్టీఆర్ బయోపిక్ లో మహానటి సావిత్రి గారి పాత్రలో నటిస్తోంది. మరోవైపు హిందీలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న 'మిషన్ మంగల్' సినిమాలో ఒక కీలకపాత్ర పోషిస్తోంది. జయలలిత బయోపిక్ కోసం డైరెక్టర్ ప్రియదర్శిని తనను కలిసినప్పుడు తనకు ప్రాజెక్ట్ పై ఉండే ఫోకస్ తెలిసిందని చెప్పింది.  జయలలిత బయోపిక్ చేపట్టడం ఒక పెద్ద బాధ్యత తో కూడుకున్న విషయమని .. మనం ఈ సినిమా చేస్తున్నామంటే జయలలిత పాత్రకు న్యాయం చేయగలిగే పనైతేనే టేకప్ చేద్దామని ప్రియదర్శినికి ముందే చెప్పేసిందట. ఒక నటిగా ఇది తనకు మంచి అవకాశం అని కూడా నిత్య చెప్తోంది. బొద్దుగా వున్నప్పటికీ..ముద్దుగుమ్మకు ఆఫర్లు మాత్రం మంచిగానే వస్తున్నాయి.