అమెరికాలో సామ్‌ దే హవా...

17:19 - September 18, 2018

వినాయక చవితి సందర్భంగా సమంత నటించిన ' యూటర్న్‌ ', నాగ చైతన్య నటించిన' శైలజా రెడ్డి అల్లుడు ' సినిమాలు రిలీజ్‌ అయ్యాయి.  చైతు సినిమా 'శైలజారెడ్డి అల్లుడు' కు టాక్ గొప్పగా లేదుగానీ పండగ సీజన్ .. వీకెండ్ ను ఫుల్ గా ఉపయోగించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద  మంచి వసూళ్లు నమోదు చేసింది. ఇక 'U టర్న్' థ్రిల్లర్ కావడంతో స్లోగా స్టార్ట్ అయింది గానీ పాజిటివ్ టాక్ తో నెమ్మదిగా పుంజుకుంది. ఓవర్సీస్ కలెక్షన్స్ సంగతి తీసుకుంటే...'శైలజారెడ్డి అల్లుడు' ప్రీమియర్లతో లక్ష డాలర్లకుపైగా కలెక్షన్స్ నమోదు చేస్తే 'U టర్న్' మాత్రం పదివేల డాలర్లతో సరిపెట్టుకుంది.  కానీ ఆ తర్వాత చైతు సినిమా కలెక్షన్స్ స్లో కాగా 'U టర్న్' మాత్రం శుక్రవారం నుండి వరసగా $28K.. $48K ..$82K. $43K కలెక్షన్స్ వసూలు చేసింది.  శని - ఆదివారాల్లో చైతు సినిమా కంటే 'U టర్న్' కలెక్షన్స్ ఎక్కువగా ఉండడం విశేషం. 'U టర్న్' ఇప్పటివరకూ 2.2 లక్షల డాలర్ల మార్కును దాటింది. ఫుల్ రన్ లో ఈ సినిమా 3 లక్షల డాలర్ల మార్క్ దాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.