అమెరికాలో సత్తాచాటుకున్న భారతీయ మహిళలు

11:32 - December 1, 2018

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ మహిళలు సత్తాచాటుతున్నారు. .తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన అమెరికా టాప్-50 మహిళల టెక్నాలజీ మొఘల్స్ జాబితాలో నలుగురు భారతీయ మహిళలకు చోటు లభించింది.  మహిళలు భవిష్యత్తుకోసం వేచి చూడరని - ప్రస్తుత సంవత్సరానికి గాను విడుదల చేసిన టాప్-50 మహిళల్లో మూడు జనరేషన్లకు చెందినవారు ఉన్నారని తెలిపింది. వీరిలో సిస్కో మాజీ చీఫ్ టెక్నాలజీ అధికారి పద్మశ్రీ వారియర్ - ఉబర్ సీనియర్ డైరెక్టర్ కోమల్ మంగతాని - కన్లూయెంట్ సహ-వ్యవస్థాపకురాలు - చీఫ్ టెక్నాలజీ అధికారి నేహా నార్ఖేడ్ - డ్రాబ్రిడ్జ్ సీఈవో - ఫౌండర్ కామాక్షి శివరామకృష్ణన్ లు ఉన్నారు. వీరు ఇప్పటికే పలు కంపెనీలకు అధిపతులుగా వ్యవహరిస్తున్నారు. 58 ఏళ్ల వయస్సు కలిగిన వారియర్..మోటరోలా - సిస్కోలకు ఎగ్జిక్యూటివ్ గా విధులు నిర్వహించి ఇటీవల చైనాకు చెందిన ఎలక్ట్రిక్-అటాన్మస్-వాహన స్టార్టప్ నియో సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.138 బిలియన్ డాలర్ల విలువైన సిస్కో సిస్టమ్స్..ఇతర కంపెనీల కొనుగోలులో ఆమె కీలక పాత్ర పోషించారు. మైక్రోసాఫ్ట్ - స్పూటిఫై బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. 43 ఏళ్ల వయస్సు కలిగిన కామాక్షి శివరామకృష్ణన్..కృత్రిమ మేధస్సు - మెషిన్ లెర్నింగ్ లను నూతన శిఖరాలకు తీసుకపోవడానికి గట్టిగా కృషి చేశారు. గుజరాత్ లోని ధర్మసిన్హా దేశాయ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్న మంగతాని..ఉబర్ బిజినెస్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే లాభపేక్ష లేని వుమెన్ వూ కోడ్ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. అలాగే నార్ఖేడ్..పుణె యూనివర్సిటీలో చదువుకున్న ఈమె..లింక్ డిన్ లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ అపాచే కఫ్కాను అభివృద్ధి చేశారు.