అమెరికాలో మహేష్‌ సినిమాలకి ట్రబుల్స్‌

11:54 - December 11, 2018

సూపర్ స్టార్ మహేష్ కి ఓవర్సీస్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా మహేష్ సినిమాలు అమెరికాలో భారీ కలెక్షన్లతో చక్కని ఫలితాల్ని అందుకుంటున్నాయి. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` నుంచి నిన్న మొన్న రిలీజైన `భరత్ అనే నేను` సైతం ఓవర్సీస్ లో  పెద్ద విజయం అందుకుంది. ఈ ఫలితాన్ని బట్టి విదేశీ బిజినెస్ లో మహేష్ హవా సాగాలి కదా?  కానీ అందుకు పూర్తి విరుద్ధంగా `మహర్షి` నిర్మాతలకు అమెరికా ఓవర్సీస్ బిజినెస్ విషయంలో చెమటలు పడుతున్నాయని తెలుస్తోంది. అదేంటీ అనుకుంటున్నారా? వివరాల్లోకి వెలితే...వాస్తవానికి మహేష్ సినిమాలన్నీ ఓవర్సీస్ లో వసూళ్ల పంట పండిస్తున్న మాట నిజమే అయినా.. భారీ ధరలకు డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొనాల్సి రావడంతో ఎవరికీ గిట్టుబాటు కావడం లేదట. గత ఏడెనిమిది సినిమాల ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే అమెరికా లో  రిలీజ్ చేసిన పంపిణీదారులు లాభాలు చూసింది ఒకే ఒక్క `శ్రీమంతుడు` విషయంలోనే. ప్రస్తుతం అదే కారణం `మహర్షి` అమెరికా బిజినెస్ కి కొరకరాని కొయ్యలా మారిందట. మహర్షి డీల్ ని భారీ ధరలకు కోట్ చేస్తుంటే ఎవరూ కొనడం లేదని తెలుస్తోంది.