అమిత్‌షాకి అక్కడి అభ్యర్థుల పేర్లు కూడా తెలియవట!

10:37 - November 20, 2018

బీజేపీ చీఫ్‌ అమిత్‌షాకి అభ్యర్థుల పేర్లు కూడా తెలియకుండా పోయిందట!. అవునండీ నిజమే...అమిత్‌షా వారి పార్టీ అభ్యర్థుల ప్రచార ప్రసంగానికి వెల్లారు..వెల్లిన ఆయనకు అసలు అక్కడి అభ్యర్థులు ఎవరు?, వారి పేర్లేంటి అన్న విషియాలు ఏమీ తెలియదు. అసలు విషియానికి వస్తే.. మధ్యప్రదేశ్‌లోని చుర్హట్‌లో సోమవారం నిర్వహించిన ర్యాలీలో షా ప్రసంగించేందుకు సన్నద్ధమయ్యారు. ఆయనకిచ్చిన ప్రసంగ పత్రంలో స్థానిక అభ్యర్థుల పేర్లు లేవు. ఎవరి తరఫున ప్రచారానికి వచ్చామో వారి పేర్లే లేకపోవడంతో నీళ్లు నమలాల్సి వచ్చింది అమిత్‌షా.దీంతో సహాయకుడిని పిలిచి ఇందులో అభ్యర్థుల పేర్లేవి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిని పోడియం వద్దకు పిలిపించుకుని అభ్యర్థుల పేర్లు రాశావా అని గుజరాతీలో ప్రశ్నించారు. భయపడుతూనే రాశాను సార్‌ అంటూ బదులివ్వడంతో ఏది.. ఎక్కడ అంటూ అసహనం వ్యక్తం చేశారు.  ఎంత సేపటికీ పేపర్లలో వేరేవాళ్లు రాసిస్తే చదవడమే తప్ప...అక్కడి ప్రజల ఇబ్బందులు, సమస్యలు నిజంగా తెలుసుకునే పరిస్థితి బీజేపీలో లేదు.