అమితాబ్‌కు లీగల్‌ నోటీసులు

12:56 - November 2, 2018

అమితాబ్‌ నటించిన ఒక ప్రకటనలో ఆయన న్యాయవాది గెటప్‌ ధరించారట. అనుమతి లేకుండా అలా న్యాయవాది గెటప్‌ ధరించి ఆ ప్రకటనలో నటించినందుకుగానూ అమితాబ్‌కు మరియు ఆ ప్రకటనను అన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేసినందుకుగానూ పలు మీడియా సంస్థలకు ఢిల్లీకి చెందిన బార్‌ కౌన్సిల్‌ నోటీసులు జారీ చేసింది. ఇలాంటి గెటప్‌లు వేసినప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రకటనను ప్రసారం చేశారని నోటీసులో పేర్కొంది.