అభ్యర్థులపై ఎన్నికల సంఘం డేగ కన్ను...జర జాగ్రత్త

11:56 - November 25, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు గడుడు దగ్గర పండుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాల్లో మునిగి తేలుతున్నారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం అన్ని పార్టీల అభ్యర్థుల కదలికలపై డేగ కన్ను వేసి వుంచింది. ఏ చిన్న తప్పు దొరికినా శిక్షతో పాటు అభ్యర్థులు పోటీకే అర్హత కోల్పోవచ్చు. తప్పదన్నట్లుంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులకు ఒక సూచనలాంటి హెచ్చరిక చేసింది. ఎన్నికల  ప్రచార సామగ్రి తరలింపునకు అనుమతించిన వాహనం. ఈ వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచార కార్యక్రమాలకు ఏ రూపంలోనూ వినియోగించ కూడదు. తెలిసి వాడినా, తెలియకుండా వాడినా ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్టే. ప్రతి రాజకీయ పార్టీ తన ప్రచార సామగ్రిని ఆయా నియోజకవర్గాలకు తరలించి తమ అభ్యర్థులకు అందించేందుకు వీలుగా  25 నియోజకవర్గాలకు ఒక రవాణా వాహనాన్ని ఎన్నికల కమిషన్‌ అనుమతిస్తుంది. ఈ వాహనం తాలూకా వివరాలు ముందుగానే ఈసీకి అందజేయాలి. వాహనం కండిషన్‌, ఇతరత్రా వివరాలు అందించాలి. కమిషన్‌ నుంచి అనుమతి లభించాక  ఈ వాహనాన్ని కరపత్రాలు, జెండాలు, బ్యానర్లు...ఇలా ఎన్నికల కమిషన్‌ అనుమతిచ్చిన సామగ్రి దేన్నయినా రవాణా చేసుకోవచ్చు.