అప్పుడు డబ్బింగ్‌ చెప్పారు...ఇప్పుడు ఫోటో దిగారు

16:10 - December 8, 2018

'బాహుబలి' విజయంతో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి.. ప్రభాస్ ల క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిన సంగతి తెలిసిందే.  హిందీ వెర్షన్ విషయాని కి వస్తే భారీ వసూళ్లతో సంచలనం సృష్టించింది.  హిందీ వెర్షన్ ను అక్కడి ప్రేక్షకులు తమ సొంత సినిమాలా గా భావించడంలో డబ్బింగ్ కీలక పాత్రం పోషించింది. ముఖ్యంగా ప్రభాస్ కు డబ్బింగ్ చెప్పిన బాలీవుడ్ నటుడు శరద్ కేల్కర్ వాయిస్ మాత్రం సూపర్ అనే చెప్పాలి. శరద్ కేల్కర్ తెలుగు ప్రేక్షకులందరికీ నటుడిగా పరిచయమే.  పవన్ కళ్యాణ్ సినిమా 'సర్దార్ గబ్బర్ సింగ్' లో శరద్ విలన్ పాత్ర పోషించాడు.  ఆ సినిమా హిట్ కాలేదుగానీ శరద్ కు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రభాస్ ను శరద్ కేల్కర్ కలవడం జరిగింది.  ప్రభాస్ 'కాఫీ విత్ కరణ్' షో లో పాల్గొనేందుకు ముంబై వెళ్ళాడు. అక్కదే శరద్ కూడా ఉండడంతో ఇద్దరూ కలిసి ఒక ఫోటోకు పోజిచ్చారు. ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి "మొహం.. గొంతు.. ఫైనల్ గా ఒకే ఫ్రేమ్ లో.  థ్యాంక్ యు.  ఇది నాకు గౌరవం.  # ప్రభాస్ @బాహుబలి మూవీ @ఎస్ ఎస్ రాజమౌళి @కరణ్ జోహార్" అని ట్వీట్ చేశాడు.  నెటిజనులకు ఈ ఫోటో నచ్చిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా?