అప్పుడు చంద్రబాబు..ఇప్పుడు కేటీఆర్‌...

16:40 - October 5, 2018

' అర్జున్‌ రెడ్డి ', ' గీతా గోవిందం ' సినిమాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ' నోటా ' ఈరోజు రిలీజ్‌ అయింది. అయితే ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో వుంటుంది. ఇదిలా వుంటే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ... '' చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వం అంటే చాలా ఇష్టం. ఆయన హయాంలోనే హైదరాబాద్‌ నగరానికి బూమ్‌ వచ్చింది. సమయ పాలన విషయంలో ప్రభుత్వోద్యోగులు చాలా హడావుడి పడటం చూసేవాణ్ని. అలా స్ట్రిక్ట్‌గా ఉంటే నాకు ఇష్టం. ఆ తర్వాత  కేటీఆర్‌  ఆలోచనలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు ' విజయ్‌ చిత్రీకరణల్లో ప్లాస్టిక్‌ని వినియోగించొద్దు. రాగి వస్తువులు కొనుక్కుని వాటితో నీళ్లు తాగు, మంచిది. నువ్వు నటుడివి కదా. ఖాదీ వస్త్రాలకు ప్రచారం కల్పించొచ్చు కదా!  ' అని చెప్పారు '' అని తెలిపాడు విజయ్.