అన్నీ అనుష్కానే అంటూ...లాస్ట్‌లో ట్విస్ట్‌ ఇచ్చాడు

11:19 - December 24, 2018

డార్లింగ్ ప్రభాస్ అనుష్కతో ప్రేమలో ఉన్నాడంటూ బోలెడంత ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.  అందుకే కాఫీ విత్ కరణ్ షోలో ప్రభాస్ పాల్గొనబోతున్నాడు అనగానే.. అక్కడ ఎఫైర్ విషయమై ఏం చెప్పబోతున్నాడు? అంటూ ఆసక్తికర చర్చ సాగింది. ఆదివారం సాయంత్రం స్టార్ వరల్డ్ లో కాఫీ విత్ కరణ్ షో తాజా ఎపిసోడ్ టెలీకాస్ట్ అయ్యింది. ఇందులో కరణ్ బాహుబలి టీమ్ని పలు ఆసక్తికర విషయాలు అడిగారు. ముఖ్యంగా ప్రభాస్ ఎఫైర్ - పెళ్లి గురించి కరణ్ ప్రశ్నించారు. ఎవరినైనా ప్రేమించారా? అని ప్రభాస్ ని ప్రశ్నిస్తే డార్టింగ్ ప్రభాస్ సింపుల్ గా నవ్వేస్తూ `నో` అనేశాడు. అనుష్కతో ఎఫైర్ అంటూ బోలెడంత ప్రచారం సాగుతోంది కదా? అని ప్రశ్నిస్తే.. కలిసి ఐదేళ్ల పాటు నటించాం. ఆ క్రమంలోనే అలా రూమర్లు వినిపించాయి అని అన్నాడు.  సౌత్ సెక్సీయెస్ట్ హీరోయిన్ ఎవరు? అంటే అనుష్క అని ప్రభాస్ చెప్పాడు. అలాగే మీ సరసన బెస్ట్ హీరోయిన్ ఎవరు? అని మూడు నాలుగు ఆప్షన్స్ చెబితే అనుష్క పేరు మాత్రమే సూచించాడు ప్రభాస్. కాఫీ విత్ కరణ్ షోలో చెప్పేవన్నీ అబద్ధాలేనా? అంటే ఎస్ అంటూ అసలైన ట్విస్టిచ్చాడు. అంటే అనుష్క గురించి డార్లింగ్ ప్రభాస్ చెప్పినది ఏదీ నిజం కాదని అర్థం చేసుకోవాల్సి వచ్చింది. ఇదిలావుంటే...బాలీవుడ్ లో నీ ఫేవరెట్ స్టార్ ఎవరు? అని ప్రశ్నిస్తే దీపిక పదుకొనే అంటూ చెప్పాడు ప్రభాస్. అలానే ఎవరు బెస్ట్ పెర్ఫామర్ అని ప్రశ్నిస్తే ఆలియాభట్ పేరు చెప్పాడు.