అనుమతి లేకుండా నా పాటలు పాడితే చట్టపరమైన చర్యలు తప్పవు: ఇళయరాజా

13:14 - November 29, 2018

స్వర మాంత్రికుడు ఇళయరాజాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇళయరాజా మీద అభిమానంతోనో, ఆయన పాటలను నచ్చో కొంత మంది గాయనీ, గాయకులు ప్రోగ్రాంమ్స్‌లో ఆయన పాటలను పాడుతుంటారు. అయితే ఇక నుంచి అలా పాడటం కుదరదంట!. అసలు విషియానికి వస్తే..ఏ కార్యక్రమంలో అయినా తాను స్వరపరిచిన పాటలు పాడే ముందు తన అనుమతి తీసుకోవాలని తెలిపారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇళయరాజా హెచ్చరించారు. ’ నా పాట‌లు పాడే ముందు ఓ సారి నా అనుమ‌తి తీసుకోండి. లేదంటే మ్యుజీషియన్స్‌తో పాటు బ్యాండ్‌ సభ్యులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. నేను ఐపీఆర్‌ఎస్‌(ఇండియన్‌ పెర్ఫార్మింగ్‌ రైట్స్‌ సొసైటీ)లో సభ్యుడిని కాకున్నా నా పాటలు పాడుతున్న వారి నుంచి రాయల్టీ ఫీజును ఐపీఆర్‌ఎస్‌ వసూలు చేస్తోంది. ఇక నుండి అలా జ‌ర‌గ‌డానికి వీలు లేదు. ఇకపై ఆ ఫీజును ద‌క్షిణ సినిమా సంగీత క‌ళాకారుల సంఘం సేక‌రిస్తుంది. భ‌విష్య‌త్ త‌రాలకు ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది’ అని ఇళయరాజా వ్యాఖ్యానించారు.