అనుకున్న ముహుర్తానికే ' RRR ' లాంచింగ్‌...

12:20 - November 11, 2018


11వ నెల 11వ తేదీ ఉదయం11 గంటలకు అనుకున్న ముహుర్తానికే వైభవంగా దర్శకధీరుడు రాజమౌళి  ' RRR  'లాంచింగ్ పూర్తైంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ చిత్ర విషయమై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలిసింది. ఈ చిత్ర షూటింగ్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీని రాజమౌళి మూడేళ్ల పాటు లీజ్‌కు తీసుకున్నారని సమాచారం. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గడ్డంతో సేమ్ లుక్‌లో కనిపిస్తున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్క్రిప్ట్ అందజేశారు. చిరంజీవి క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు.