అనుకున్న టైంకే ' నోటా '

13:01 - September 18, 2018

' గీతా గోవిందం ' ఇప్పుడు టాలివుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌లో అందరిలోనూ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన డిబెట్‌ సాగింది. దీంతో ఇందులో హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్‌ పెరిగిపోతుంది. నాలుగు సినిమాలకే 100 కోట్లు క్లబ్‌ హీరోగా విజయ్ దేవరకొండ చుట్టూ ఒకటే ఎగ్జయిట్‌మెంట్‌. దేవరకొండ తాజా చిత్రం `నోటా` రిలీజ్ వార్ లో ఉందిప్పుడు. ఇటీవలే ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ కి జనం నుంచి అద్భుత స్పందన వచ్చింది. అయితే ఈ సినిమా ముందే అనుకున్నట్లు అక్టోబర్‌ 4కి రావడంలేదని ప్రచారం సాగింది.  అక్టోబర్ 18న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని కొందరు తేదీని ప్రకటించేసరికి ట్రేడ్ లో డైలమా నెలకొంది.  కానీ ఈ విషియాన్ని నోటా మేకర్స్‌ ఖండిస్తూ...అనుకున్న టైంకే నోటా వస్తుందని తెలిపారు. దీంతో సస్పెన్స్ వీడింది.

సరిగ్గా తెలుగు రాష్ట్రాల్లో సిసలైన పొలిటికల్ స్టంట్ మొదలైన వేళ `నోటా` అంటూ వస్తున్నాడు దేవరకొండ. అతడి టైమింగ్ పెర్ ఫెక్ట్ అన్న ముచ్చటా సాగుతోంది. ఈ నేపథ్యం నోటాపై హైప్ ను పెంచుతోంది. ఆ క్రమంలోనే మేకర్స్ నోటా ప్రచారంలోనూ వేడి పెంచే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు వేగంగా పూర్తవుతున్నాయని తెలుస్తోంది.