అనుకున్న టైంకి ' ఆర్‌ ఆర్‌ ఆర్‌ 'రావడం డౌటేనట!

14:59 - November 12, 2018

బాహుబలి’ తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడు.. ఎవరితో చేస్తాడని తీవ్ర ఉత్కంఠ నెలకొంది జనాల్లో. ఈ ఉత్కంఠకు గత ఏడాదే తెర దించేశాడు జక్కన్న. జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ ల కలయికలో మల్టీస్టారర్ తీయబోతున్నట్లు వెల్లడించాడు. అనుకున్న విధంగానే రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌తో చేస్తున్న ' ఆర్‌ఆర్‌ఆర్‌ ' చిత్రానికి ఈనెల 11న ప్రారంభోత్సవం జరిగింది.  ప్రారంభోత్సవం సందర్భంగా చిత్ర బృందం.. 2020 వేసవి విడుదల అని ప్రకటించింది. అయితే ఈ చిత్రం విడుదల మాత్రం అనుకున్న టైంకి పూర్తవుతుంది అన్న విషియంలో ప్రేక్షకులకు డౌటేనట! ఎందుకంటే.. రాజమౌళి దర్శకుడిగా ఒక స్థాయిని అందుకున్నాక ఏ సినిమా కూడా అనుకున్న ప్రకారం పూర్తయి.. ముందు చెప్పిన సమయానికి రిలీజైంది లేదు. ఒక చిన్న సన్నివేశం విషయంలో కూడా రాజీ పడని మనస్తత్వం రాజమౌళిది. కాబట్టి షూటింగ్ ఆలస్యం కావడం అన్నది సహజమైన విషయం.  ‘బాహుబలి: ది బిగినింగ్’.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాల విషయంలో ఎంత ప్లానింగ్ తో ఉన్నప్పటికీ రెండు సినిమాలూ ఆలస్యమయ్యాయి. అనుకున్నదాని కంటే ఆలస్యంగానే విడుదలయ్యాయి. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ మాత్రం షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసుకుని.. 2020లోనే విడుదలవుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. జక్కన్న సినిమా అంటే నిర్మాతలు చెప్పే డెడ్ లైన్ కి జనాలు కనీసం ఆరు నెలలైనా కలుపుకుంటారు. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలోనూ అలాగే ఆలోచిస్తున్నారు.