అధికార, ప్రతిపక్షాలకు చెమటలు పట్టిస్తుంది ఒకే ఒక్కడు

17:37 - October 13, 2018

తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలకు చెమటలు పట్టిస్తున్న ఒకే ఒక్కడు మోత్కుపల్లి నరసింహులు. ఆలేరు నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిగ్ గా మారింది. ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు మోత్కుపల్లి నరసింహులు స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. నిన్న మొన్నటి వరకు టీడీపీలోనే కొనసాగిన మోత్కుపల్లి నరసింహులు పార్టీ అధినేత చంద్రబాబును బహిరంగంగా విమర్శించి బహిష్కరణకు గురయ్యారు. ఆ తరువాత టీఆర్ఎస్ లో చేరాలనుకున్న కుదరలేదు. కాంగ్రెస్ లో అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలేరులో మోత్కుపల్లికి బలమైన క్యాడర్ ఉంది. ఇక్కడ నుంచి ఆయన 6 సార్లు విజయం సాధించారు. మోత్కుపల్లి పోటీతో అటు టీఆర్ఎస్ ఇటు టీడీపీ ఓటర్లలో భారీగా చీలిక వస్తుందేమోనని ఇరు పార్టీలు మదనపడుతున్నాయి. ఎక్కడ రెండో స్థానంలో నిలిచి పరువు పోగొట్టుకోవాల్సి వస్తుందోనని టీఆర్ఎస్ మదనపడుతుంగా గెలుపే లక్ష్యంగా ఉన్న తమకు మెజార్టీ సీట్లు రాక చతికిలపడతామేమోనని కాంగ్రెస్ కలవరపాటుకు గురవుతుంది. మొత్తానికి అధికార ప్రతిపక్షాలకు ఈ ఒక్కడి పోటీ ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తోందట..ఇదిలా వుంటే ఆలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నుండి గొంగిడి సునిత, కాంగ్రెస్‌ నుండి బూడిద బిక్షమయ్య గౌడ్‌ రెడీ అవుతున్నారు.