అదీ మహేష్‌ ఫ్యాన్స్‌ సత్తా...

12:49 - September 15, 2018

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు ఎంతటి అభిమానులు వుంటారో మనందరికీ తెలిసిన విషియమే. మరి అలాంటి అభిమానులకు తమ అభిమాన హీరో మహేష్‌ బాబు ను ఏమన్నా అంటే ఊకుంటారా?...అస్సలు ఊరుకోరు. అన్నవారికి చుక్కలు చూపిస్తారు. ప్రస్తుతం అదే జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబుపై తాజాగా తమిళ కమెడియన్ మనోజ్ ప్రభాకరన్ వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెల్సిందే. స్పైడర్ చిత్రంలో మహేష్ బాబు కంటే విలన్ గా నటించిన ఎస్ జే సూర్య బాగా నటించాడని - మహేష్ బాబుకు నటన సరిగా రాదనడంతో పాటు - బాలీవుడ్ హీరోయిన్ కత్రిన కైఫ్ కు మేల్ వర్షన్ మహేష్ అన్నాడు. ఇక మహేష్‌ అభిమానులు  సోషల్ మీడియాలో మనోజ్ ప్రభాకరన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కొన్ని వేల కామెంట్స్ తో మనోజ్ సోషల్ మీడియా పేజ్ నిండిపోయింది. కొందరు డైరెక్ట్ గా కూడా ఫోన్ లు చేసి మనోజ్ ను దూషిస్తున్నట్లుగా తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. 

మహేష్‌ ఫ్యాన్స్‌ చేసే విమర్శలకు మనోజ్ ప్రభాకరన్ సారీ చెబుతూ ఒక వీడియోను విడుదల చేశారు.  తాను మహేష్ బాబుపై వ్యక్తిగత ఉద్దేశ్యంతో విమర్శలు చేయలేదని - కేవలం తన తన వీడియో హైలైట్ అవ్వాలనే చేశాను అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇటీవల తమిళనాట మహేష్ బాబు నటించిన పలు చిత్రాలు డబ్ అయ్యాయి. అక్కడ మహేష్ కు వస్తున్న క్రేజ్ ను చూసి ఓర్వలేక కొందరు ఇలా చీప్ ట్రిక్స్ ను ప్లే చేస్తున్నారు అంటూ అభిమానులు ఆరోపిస్తున్నారు.