అదిరిపోయిన మహేష్‌ లుక్స్‌

11:10 - September 8, 2018

ఎప్పుడూ హ్యాడ్సమ్‌గా కనిపించే మహేష్‌బాబు మరోసారి తన లుక్స్‌తో అదరగొట్టేశాడు. గోవారికర్ రీసెంట్ గా మహేష్ బాబు తో ఫోటో షూట్ చేయడం జరిగింది.  ఆ మోనోక్రోమ్ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంటూ "పోస్ట్ ప్యాక్ అప్ షూట్ విత్ ద సూపర్ ఛార్మింగ్ సూపర్ ఫాస్ట్ సూపర్ స్టార్.. మహేష్ బాబు' అనే క్యాప్షన్ ఇచ్చాడు.  ఇక ఫోటో ఎలా ఉంది అంటే 'మహర్షి' బియర్డ్ లుక్ కావడంతో బ్లాక్ అండ్ వైట్ ఫొటో కొత్తగా ఉంది. సహజంగా ఎవరైనా ఆనందంగా కనిపించినప్పుడు కళ్ళలో మెరుపు కనిపించిందని అంటుంటారు. ఇక అవినాష్ గోవారికర్ మాత్రం మహేష్ కళ్ళలో మెరుపు అందరికీ కనిపించేలా ఫోటో తీయడం విశేషం.