అదరగొడుతున్న ' కేజీఎఫ్‌ ' లిరికల్‌ సాంగ్‌

15:27 - December 5, 2018

కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కేజీఎఫ్'సినిమా నిర్మితమైంది. తాజాగా తెలుగు వెర్షన్ నుంచి 'సలామ్ రాఖీ భాయ్' అనే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. 'జగమేలుతోన్న సుల్తాను వీడే .. జగడానికొస్తే సైతాను వీడే .., గన్నంచుల్లో ధమ్కీ .. కరుణేలేని కల్కి .. వంటి పదప్రయోగాలు బాగున్నాయి. 'అన్నీ తానై పెంచిన అడుగు .. పరుగు నేర్పిన అమ్మ మాటే మంత్రం .., నిప్పు .. నొప్పి తెలిసిన .. తప్పు .. ఒప్పు మరిచిన గెలుపే వీడి సూత్రం .. ' వంటి వాక్యాలు ఎమోషనల్ గాను మనసును టచ్ చేస్తున్నాయి. ఇటీవల వచ్చిన ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సాంగ్ కూడా జనంలోకి దూసుకెళ్లేలానే వుంది.  భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను, కన్నడతోపాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందించగా .. తెలుగు పాటలకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు.