అదంత పెద్ద విషియం కాదు: హన్సిక

14:18 - December 23, 2018

స్టార్ హీరోలు లేదా స్టార్ డైరెక్టర్లు లేని ఒక సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడానికి పబ్లిసిటీ ఒక్కటే మార్గం.  పబ్లిసిటీ అనగానే ప్రమోషన్స్ వినూత్నంగానైనా ఉండాలి లేదా ఏదో ఒక వివాదాన్నైనా రాజెయ్యాలి. అప్పుడే అందరి దృష్టి ఆ సినిమాపైన పడుతుంది. తమిళంలో హన్సిక హీరోయిన్ గా తెరకెక్కుతున్న 'మహా' సినిమా మేకర్లు సరిగ్గా ఇదే రూట్ ఫాలో అయ్యారు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో హన్సిక ఒక సాధువు దుస్తులు ధరించి హుక్కా పీలుస్తుండడం.. ఆమె ఒక పెద్ద కుర్చీలో కూర్చొని ఉంటే ఇతర సాధువులు కింద కూర్చొని ఉండడం వివాదానికి దారి తీసింది.  ఇప్పటికే ఈ పోస్టర్ పై పలు కేసులు రిజిస్టర్ అయ్యాయి.  హన్సిక... దర్శకుడు జమీల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల వారు కోరుతుకున్నారు. బీజెపీ ఎంఎల్ఎ  రాజాసింగ్ ఈ విషయంలో 'మహా' ఫిలిం మేకర్స్ ను ఇలాంటి పనులు చేస్తే మేం చూస్తూ ఊరుకోమని హెచ్చరించాడు.  పోస్టర్ వివాదం పై స్పందించిన హన్సిక  అందంత పెద్ద విషయం కాదని సినిమాలో ఇలాంటివి ఇంకా ఉన్నాయని జవాబిచ్చింది. హన్సిక రెస్పాన్స్ ఈ వివాదాన్ని మరింత పెంచేదిలా ఉంది. హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోవడంతో ఇలాంటి వివాదాలు సృష్టించి పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.