అత్యంత కనిష్టమైన రూపాయి విలువ...!

17:27 - October 3, 2018

మన ప్రధాని నరేంద్ర మోడీ పుణ్యమా అని రూపాయి విలువ రోజు రోజుకూ తగ్గుతూ క్షీనించిపోతుంది. బీజేపీ ప్రభుత్వం వచ్చాక పెట్రోల్‌, గ్యాస్‌, నిత్యవసర వస్తువుల రేటు నియంత్రన లేకుండా పెరుగుతూనే వున్నాయి.  తాజాగా రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థనే కృంగదీస్తోంది. బుధవారం డాలర్ తో రూపాయి మారకం విలువ 73.34కు చేరింది. ఇదే అత్యంత జీవనకాల కనిష్టం అని మార్కెట్ వర్గాలంటున్నాయి. మంగళవారం 72.91 వద్ద స్థిరపడ్డ రూపాయి.. బుధవారం ఏకంగా 35 పైసలు నష్టపోవడం మార్కెట్ వర్గాలను షాక్ కు గురిచేసింది. అమెరికా డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతోంది. ఈ పతనం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికా డాలర్ కు డిమాండ్ పెరిగిపోవడంతో దేశీయ రూపాయి భారీగా క్షీణిస్తోంది. ప్రస్తుతం 73.33 వద్ద రూపాయి మారకం విలువ ఉంది. రూపాయి విలువ పడిపోవడానికి విదేశీ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడమే కాకుండా ముడిచమురు ధరలు పెరగడమే ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దిగుమతుల నుంచి డాలర్ కు డిమాండ్ పెరగడం కూడా రూపాయి పడిపోవడానికి కారణమవుతోంది.