అక్కడ సెల్ఫీ దిగితే అంతే సంగతులట!

17:47 - November 23, 2018

సెల్ఫీ.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ దీని గురించి తెలుసు.. ప్రస్తుత పరిస్థితుల్లో సెల్ఫీలు తీసుకోనిదే ఎవ్వరూ ఉండని పరిస్థితి.  ఎక్కడ దిగినా ఏం కాదు, కానీ అక్కడ దిగితే మాత్రం కేసు తప్పదని ఎన్నికల కమీషన్‌ వెల్లడించింది. అదేంటీ మన సెల్ఫీ మన ఇష్టం దీంతో ఎన్నికల కమీషన్‌కు సంబందం ఏంటీ? అనుకుంటున్నారా?..అసలు విషియాని వద్దాం...ఎక్కడైనా సెల్ఫీ తీసుకోండి కానీ పోలింగ్ కేంద్రాల్లో కుదరదు అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం..తాజాగా పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీలు దిగడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిషేధించింది. ఒకవేళ ఇది అతిక్రమించి సెల్ఫీ తీసుకుంటే 49ఎం నియమం ఉల్లంఘించినందుకు ఓటరును బయటకు పంపించే అధికారం అధికారులకు ఉంటుంది. ఈ మేరకు కొత్తగా ఎన్నికల నియమావళిలో 17ఏను నమోదు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఆ ఓటును పరిగణలోకి తీసుకోకుండా నిబంధనను ప్రవేశపెట్టారు. మొదటి సారి అంటూ ఓటు వేసి సెల్ఫీలు తీసుకునే యువత ఎంతో మంది ఉంటారు. వారికి ఈ కొత్త నిబంధనపై అవగాహన తక్కువ. వారంతా సెల్ఫీలు తీసుకునే అవకాశాలుంటాయి. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ దీనిపై అవగాహన కల్పిస్తే మంచిది. లేదంటే సెల్ఫీలు తీసుకొని ఓటు హక్కు కోల్పోవడంతోపాటు యువత చిక్కుల్లో పడడం ఖాయం..