అందులో పవన్‌ కళ్యాణ్‌ని తిట్టలేదట!

10:43 - December 3, 2018

శ్రీకాంత్‌ కథానాయకుడిగా కరణం బాబ్జీ దర్శకత్వంలో టి.అలివేలు నిర్మించిన ‘ఆపరేషన్‌ 2019’ ఇటీవల విడుదలైంది. '' ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా తీసిన సినిమా ఇది. ఈ మధ్యకాలంలో నేను నటించిన సినిమాల్లో బాగా సంతృప్తినిచ్చింది. వసూళ్లు బావున్నాయి '' అని శ్రీకాంత్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌ మీట్‌లో శ్రీకాంత్‌ మాట్లాడుతూ ''  సినిమాకు ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అయ్యారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు ఆనందంగా ఉన్నారు. రివ్యూలు మాత్రం కాస్త బాధ కలిగించాయి. విమర్శకుల అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తున్నాం. రివ్యూ రాసేవాళ్లు కాస్త ఆలోచించి రాయాలి. ఒక సినిమా హిట్‌ అయితే మరో పది మందికి పరిశ్రమలో పని, అన్నం దొరుకుతుంది''  అని అన్నారు. ''  దర్శకుడిగా కాకుండా బాధ్యత గల పౌరుడిగా భావించి తీశా. సినిమాలో పవన్‌ కల్యాణ్‌ను ఎక్కడా తిట్టలేదు''  అని దర్శకుడు చెప్పారు.