అందుకే కళ్యాణం ఒద్దనుకున్నా..: ఏక్తాకపూర్‌

16:55 - October 5, 2018

ఒకటి కావాలంటే..మరొకటి ఒదులుకోవాలని అన్నదాన్ని కొంతమందే పాటిస్తుంటారు. అయితే అందులో ఏక్తాకపూర్‌ను చేర్చవచ్చు. అదెలా..అంటారా! అయితే ఇది చదవండి. వెండితెర మీదా, బుల్లితెర మీదా నిర్మాతగా, దర్శకురాలిగా దూసుకుపోతున్న ఏక్తాకపూర్‌ సినిమాల కోసమే పెళ్ళికి దూరమైందట. ఈ విషయాన్ని స్వయంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు. తన ఫాదర్‌ తన ముందు రెండు ఆప్షన్లు ఉంచారట. పెళ్ళా, సినిమానా ఏదో ఒకటి తేల్చుకోమన్నారట. కళ కోసం తను కల్యాణాన్ని వదులుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.