అందరికీ షాకిచ్చిన మెగా అల్లుడు..

13:08 - November 23, 2018

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మొదటి చిత్రంను రాకేష్ శశి అనే పెద్దగా గుర్తింపు లేని దర్శకుడితో చేసిన కళ్యాణ్ దేవ్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయాడు. మొదటి సినిమా నిరాశ పర్చడంతో రెండవ సినిమానైనా ఒక క్రేజీ డైరెక్టర్ తో కళ్యణ్ దేవ్ చేస్తాడని అంతా అనుకున్నారు. కాని తాజాగా కొత్త దర్శకుడికి కమిట్ అయిన కళ్యాణ్ అందరికి షాక్ ఇచ్చాడు. ‘విజేత’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని నటన మరియు డాన్స్ ల్లో మరింత శిక్షణ తీసుకున్న కళ్యాణ్ దేవ్ రెండవ సినిమా దాదాపుగా ఖరారు అయ్యిందట. తన రెండవ సినిమాను కళ్యాణ్ కొత్త దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. పులి వాసు తీసుకు వచ్చిన స్క్రిప్ట్ బాగా నచ్చడంతో కళ్యాణ్ ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. కళ్యాణ్ దేవ్ రెండవ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుందట. మొదటి సినిమాకు చేసిన తప్పునే మరోసారి కళ్యాణ్ దేవ్ చేస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు.