అండర్‌ వాటర్‌లో చిరూ ఫైట్‌

16:25 - December 14, 2018

చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు సురేందర్ రెడ్డి 'సైరా' సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాకి సంబంధించి చాలా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్లో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇందుకోసం ఈ తరహా యాక్షన్ సీన్స్ ను కంపోజ్ చేయడంలో నిపుణులైనవారిని ముంబై నుంచి రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది. అండర్ వాటర్లో జరిగే ఈ యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా చూస్తున్నారట. ఏకధాటిగా కొన్ని రోజులపాటు అండర్ వాటర్లో యాక్షన్ దృశ్యాలను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. రిస్క్ తో కూడుకున్న ఈ సన్నివేశాల్లో చేయడానికి చిరంజీవి ఎంత మాత్రం వెనుకాడకపోవడం విశేషమని చెప్పుకుంటున్నారు. వచ్చే వేసవి సెలవుల్లో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.