మెగాస్టార్‌ బయోపిక్‌పై నాగబాబు స్పందన....

17:26 - February 14, 2019

ఎప్పుడూ లేనిది ఇప్పుడు టాలీవుడ్ లో బయోపిక్ ల సీజన్ ఉదృతంగా నడుస్తోంది. సావిత్రి-ఎన్టీఆర్ కథలు అయిపోయాయి. కాంతారావుది నిర్మాణంలో ఉంది. అక్కినేని నాగేశ్వర్ రావుది తీసే సమస్యే లేదని నాగార్జున ఆల్రెడీ కుండ బద్దలు కొట్టేసారు. సో ఇప్పుడు మెగాస్టార్ బయోపిక్ తీస్తే ఎలా ఉంటుందా అనే చర్చ అభిమానుల మధ్య రావడం సహజం. ఇటీవలే ఓ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగా బ్రదర్ నాగబాబుకు ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే అన్నయ్యకు చరణ్ తనకూ అలాంటి ఆలోచనే లేదని జనాన్ని థియేటర్లు రప్పించేంత డ్రామా కాని ఓవర్ ఎమోషన్స్ కాని ఆయన లైఫ్ లో లేవని అందుకే ఆ ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చేసాడు. అయితే సినిమా జనం మాత్రం చిరంజీవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్ నుంచి హీరోగా మారడానికి పడిన స్ట్రగుల్,  ఖైది మేకింగ్ ఎదురుకున్న సాధక బాధలు తర్వాత ఎన్టీఆర్ కృష్ణ లెగసిని అందిపుచ్చుకోవడానికి పడిన కష్టం, అల్లు అమ్మాయిని చేసుకున్నాక గీత బ్యానర్ సహకారంతో స్టార్ గా ఎదిగిన వైనం తదితరాలు అన్ని చూపించవచ్చు కదా అంటున్నారు. ఇవన్ని నాగబాబుకు తెలియదు అని కాదు కాని చిరు అభిమానుల అంచనాలను అందుకునేలా బయపిక్ తీయడం నిజంగా కత్తి మీద సామే. చరణ్ కు సైతం అంత బరువు మోసే వయసు కాదు. చేస్తే చిరునే ఆయన బయోపిక్ లో నటించాలి. లేదా నాగబాబు అన్నట్టు చేసే ఆలోచనే మానుకోవాలి.