హైకోర్టులో చిన్మయికి ఊరట...

14:29 - March 16, 2019

తమిళనాట సంచలనంగా మారిన చిన్మయి విషయం అటు ఇటు తిరిగి కోర్టును చేరింది. మీటూ అంటూ చిన్మయి కొన్నాళ్ల క్రితం వైరముత్తు మరియు రాధ రవిలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ తరువాత కొన్ని రోజులకి  డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ నుంచి ఆమె సభ్యత్వంను రద్దు చేస్తున్నట్లు డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ అధ్యక్షుడు రాధ రవి ప్రకటించాడు. తొలగించడానికి కారణాలుగా ఆమె అసోషియేషన్‌కు చెల్లించాల్సిన ఫీజు చెల్లించడంలేదని చెప్పడం జరిగింది. నవంబర్ లో ఈమె సభ్యత్వంను రద్దు చేస్తూ డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ వారు నిర్ణయం తీసుకుంది. శాస్వత సభ్యత్వం ఉన్న తనను ఎలా తొలగిస్తారంటూ అప్పటి నుండి కూడా చిన్మయి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూనే ఉంది. తమిళ సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ విషయమై స్పందించాలని చాలా సార్లు ఆమె డిమాండ్ చేసింది. అంతేకాదు   పలుసార్లు అసోషియేషన్ సభ్యులను బెదింరించినా మరో విధంగా చెప్పినా కూడా ఆమెకు సభ్యత్వంను తిరిగి ఇచ్చేందుకు పలు కండీషన్స్ పెట్టడం జరిగింది. దాంతో ఆమె హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. ఆమె పిటీషన్ ను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. విచారణ సమయంలో ఆమెపై ఉన్న నిషేదంను ఎత్తి వేస్తూ స్టే విధించింది. డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ లో ఆమెపై ఉన్న నిషేదానికి స్టే విధించడంతో పాటు అసోషియేషన్ అధ్యక్షుడు అయిన రాధారవికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అంతేకాదు చిన్మయి సభ్యత్వంను రద్దు చేయడానికి గల తగు కారణాలను వెళ్లడించాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మార్చి 25వ తేదీ వరకు రాధారవి మద్రాస్ హైకోర్టుకు రాధారవి డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ తరపును సమాధానం చెప్పాల్సి ఉంటుందట!.