పథకాలే కాదు యాగాలు కూడా: తెలంగాణా నుంచే కాపీనా?

16:20 - January 9, 2019

రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చినా ఇంకా అధికారాన్ని బట్టి తాము రాజులమే అని భావించుకుంటున్నట్టున్నరు మన నేతలు. అధికారం కోసం ప్రజలని నమ్ముకోవటం అవసరం అనుకున్నారో ఏమో గానీ ఆనాటి కాలపు రాజుల లాగే తమ అధికారాన్ని నిలుపుకోవటానికి యాగాలూ, యజ్ఞాలూ చేయించేస్తున్నారు. మాకు ప్రజా సేవే ముఖ్యం అని చెప్పే మాటలన్నీ ఇక్కడ మంత్రాల సాక్షిగా అవమానించ బడుతున్నాయి. 


తెలంగాణాలో కేసీఆర్ ప్రతీ దానికి ఒక యాగమో, యజ్ఞమో చేయించినట్టుగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్ర బాబుకూడా  యజ్ఞయాగాదులపై నమ్మకం పెంచుకుంటున్నారు. కేసీఆర్ పద్దతిలోనే ఆయన చేసిన యాగాన్నే చంద్రబాబు కూడా జరిపించారని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కేసీఆర్ రాజశ్యామలయాగం చేసారని తెలియటం, ఆ వెనువెంటనే అమోఘమైన విజయం దక్కడంతో ఎన్నికల ముందు చంద్రబాబు కూడా అదే పంథాలో వెళ్తున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్‌కు విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానంద ఈ యాగం చేయించగా, చంద్రబాబు మాత్రం అప్పుడప్పుడూ యూట్యూబ్ లో కనిపిస్తూ ఆమధ్య బాబు గోగినేని తో డిబేట్ లో "నాకేమీ రాదు నేను చెప్పేవన్ని అబద్దాలు" అని చెప్పిన జ్యోతిష్కుడు వేణుస్వామితో ఈ యాగం చేయించినట్లు తెలుస్తోంది.

రాజశ్యామల యాగం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు చేసినట్టుగా చరిత్ర చెబుతోంది మళ్ళీ ఇప్పటివరకూ ఆ యాగాన్ని ఎవ్వరూ చేయనే లేదట.  ఈ యాగం చేయటం ద్వారా ఆ చేయించిన రాజుకు యుద్దభయం ఉందదని, రాజ్యం ఆ రాజు పాలనలో కరువు కాటకాలు రాకుందా ఉండటం వల్ల ప్రజలు ఆ రాజుకి లోబడి ఉంటారు అని చెబుతారు. ఇదే యాగాన్ని కేసీఆర్ అప్పట్లో తెలంగాణా ఉధ్యమ సమయంలో కూడా చేయించారు ఆయనకు మంచి ఫలితాలు ఇవ్వడంతో చంద్రబాబు కూడా అదే యాగం చేయించినట్లు తెలుస్తోంది.

జ్యతీష్యుడు వేణుస్వామి ఉపదేశాన్ని అంగీకరించిన చంద్రబాబునాయుడు కూడా రాజశ్యామల యాగం చేయించారు. గుంటూరు జిల్లాలోని చీరాలలో వేణుస్వామి ఈ రాజశ్యామల యాగం చేశారట. యాగం చేసిన తర్వాత వేణుస్వామి యాగ ఫలాన్ని తీసుకుని చంద్రబాబు వద్దకు వచ్చి ఆశీర్వదించారు. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో గెలుపు అనుమానమే అని చంద్రబాబు గారికి సంకేతాలేమైనా అందాయా? లేక గెలుపు కోసం ఎందుకైనా మంచిది అని ఈ యాగం చేయించారా అన్నది ఇప్పుడు వస్తున్న అనుమానం. ఏదైతేనేమొ మొత్తాని సీఎం కి యాగం చేసి పెట్టినందుకు వేణుస్వామి గారి జ్యోతీష్య వ్యాపారం కూడా బాగానే పాపులర్ అవ్వొచ్చు. ఇవన్నీ సరే గానీ అసలు ఇప్పటికే తమ పథకాలన్నీ చంద్ర బాబు కాపీ కొడుతున్నారని ఆరోపించిన తెలంగాణా సీయం కేసీఆర్ ఈ యాగం విషయం వింటే ఇంకేమంటారో మరి.