IPL-2019 బోణికొట్టిన చెన్నై : బెంగళూరు పై అలవోక విజయం

06:54 - March 24, 2019

*ఐపీఎల్ -12 తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై చెన్నై బోణీ

*20 పరుగుల లక్ష్యాన్ని చేదించిన సూపర్ కింగ్స్ 

*7 వికెట్ల తేడాతో అలవోక విజయం

 

చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్-12 తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. ఐపీఎల్ 2019 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ ఘనమైన బోణి అందుకుంది. అయితే ఈ రీఎంట్రీని గ్రాండ్ గా మొదలుపెట్టింది ఈ టీమ్. పిచ్‌ స్పిన్‌కి అనుకూలించేలా కనిపించడంతో చెన్నై ముగ్గురు స్పిన్నర్లు, బెంగళూరు ఇద్దరు స్పిన్నర్లలతో బరిలోకి దిగింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెపాక్ వేదికగా శనివారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు వ్యూహం ఫలించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఇచ్చిన 70 పరుగుల లక్ష్యచేధన కోసం బ్యాటింగ్‎కు దిగిన చెన్నై17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది.
 
చెన్నై బ్యాట్స్‎మెన్స్‎లో వాట్సన్ డక్ అవుట్ కాగా రాయుడు 28, రైనా 19 పరుగులు చేసి అవుటయ్యారు. జడేజా 6, జాదవ్ 13 రన్స్‌తో నాటౌ‌ట్‌గా నిలిచారు. తొలుత బ్యాంటింగ్‌కు దిగిన బెంగళూరు బ్యాట్స్‌మెన్స్‌లో పార్థివ్ పటేల్ (39) మినహా అందరూ చేతులేత్తేశారు. బెంగళూరు బ్యాటింగ్‌లో ఇవే అత్యధిక పరుగులు. కోహ్లీ 6, మొయిన్ అలీ 9, ఏబీ డివిలియర్స్ 9, హెట్‌మెయిర్ డకౌట్ అయ్యారు. ఇలా కీలక ఆటగాళ్లంతా తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. చెన్నై బౌలర్లలో హర్భజన్ సింగ్‌కు 3, ఇమ్రాన్ తాహిర్‌కు 3, జడేజాకు 2, డ్వాన్ బ్రావోకు 1 వికెట్ దక్కింది.