దిష్టిబొమ్మతో టైటిల్‌ పోస్టర్‌

12:18 - December 31, 2018

న్యూ ఇయర్లో ఎవరికీ దిష్టి తగలకుండా అందరికీ శుభమే జరగాలని కోరుకుంటూ వెరైటీగా  'బ్రోచేవారెవరురా' ఈ పోస్టర్ ను వదిలారు. 'మెంటల్ మదిలో' సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన వివేక్ ఆత్రేయ, శ్రీ విష్ణు హీరోగా ఒక సినిమాను రూపొందించడానికి రంగంలోకి దిగిపోయాడు. ఈ సినిమాకి 'బ్రోచేవారెవరురా' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. 'చలనమే చిత్రము .. చిత్రమే చలనము' అనేది ట్యాగ్ లైన్. తాజాగా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు.  క్రైమ్ కామెడీగా రూపొందుతోన్న ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన నివేదా థామస్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించనున్నారు. సత్యదేవ్ .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనేది వివేక్ ఆత్రేయ చెబుతోన్న మాట.