మెదక్ విషయంలో ఇంకా రహస్యమే : బీజేపీ తెలంగాణా అభ్యర్థుల జాబితా

06:16 - March 24, 2019

*బీజేపీ లోక్ సభ ఎన్నికల అభ్యర్తుల జాబితా

*మరో ఆరుగురితో రెండవ  జాబితాని ప్రకటించిన బీజేపీ 

*ఇంకా ఖరారు కాని మెదక్ అభ్యర్థి 

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలన్నీ వేగం పెంచాయి. ఆరుగురు అభ్యర్థులతో కూడిన రెండో లిస్ట్‌ను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం ప్రకటించింది. మెదక్‌ స్థానంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పదిమందితో కూడిన తొలి జాబితాను గురువారమే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ప్రకతిన్చినవారితో కలిపి  ఇప్పటివరకూ మెదక్‌ మినహా మిగతా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.  తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాలో. 


ఆదిలాబాద్(ఎస్టీ) ‌: సోయం బాబూరావు
కరీంనగర్‌: బండి సంజయ్‌
నిజామాబాద్‌: డి. అరవింద్‌
మల్కాజిగిరి: ఎన్‌ రామచంద్రరావు
సికింద్రాబాద్‌: కిషన్‌ రెడ్డి
మహబూబ్‌నగర్‌: డీకే అరుణ
నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ): బంగారు శ్రుతి
నల్లగొండ: గార్లపాటి జితేంద్రకుమార్‌
భువనగిరి: పీవీ శ్యామ్‌సుందర్‌ రావు
వరంగల్‌: చింతా సాంబమూర్తి
మహబూబాబాద్‌: హుస్సేన్‌నాయక్‌
పెద్దపల్లి(ఎస్సీ) : ఎస్‌ కుమార్‌
ఖమ్మం: వాసుదేవ రావు
చేవెళ్ల: బీ జనార్థన్‌
హైదరాబాద్: భగవంత్‌ రావు 
జహీరాబాద్‌: బాణాల లక్ష్మారెడ్డి
రెండో జాబితాతో కలిపి మొత్తం 26 మంది అభ్యర్థులను ప్రకటించిన బీ.జేపీ. మెదక్ స్థానాన్ని కూడా త్వరలో ఖ్రారు చేయనుంది.