ప్రజల్లో సానుభూతి కోసం ఒక బీజేపీ నేత కన్న కూతుర్ని ఏం చేశాడో తెలుసా...?

15:22 - February 18, 2019

పదవులకోసం రాజకీయ నాయకులు ఏమైనా చేస్తారన్నది అందరికీ తెలిసిన విషియమే. అయితే ఒక్కొక్కసారి మరీ విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. వాళ్ల అవసరానికి కన్నవారిని కూడా అడ్డం పెట్టుకోటానికి వెనుకాడరు. తాజాగా ఇలాంటిదే ఒక సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెలితే...పశ్చిమ బెంగాల్ లో బీజేపీ నేత ఒకరు  ప్రజల్లో సానుభూతి సంపాదించుకునేందుకు కన్న కూతుర్ని కిడ్నాప్ చేయించాడు! ఆ నేరాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే పై నెట్టి ఆయనను డీ ఫేమ్ చేయించేందుకు ప్రయత్నించాడు. బీర్బమ్ జిల్లా లాభ్ పూర్ లో బీజేపీ నేత సుప్రభాత్ బత్యబాల్ కుమార్తె గత గురువారం కిడ్నాప్ కు గురవ్వడం కలకలం సృష్టించింది. సుప్రభాత్ లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడిన దుండగులు తుపాకీతో బెదిరించి ఆయన కుమార్తెను అపహరించుకుపోయారు. ఈ ఘటనతో లాభ్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రభాత్ కుమార్తె కిడ్నాప్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మాల్డా జిల్లాలోని డల్ఖోలా ప్రాంతంలో ఆమె ఆచూకీ గుర్తించారు. సురక్షితంగా ఆమెను ఇంటికి చేర్చారు.అయితే కిడ్నాప్‌ జరిగిన తరువాత...ఆ కిడ్నాప్‌ వెనుక  స్థానిక తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మనిరుల్ ఇస్లామ్ హస్తముందని సుప్రభాత్ వర్గీయులు ఆరోపించారు. శనివారం ఆయన కారుపై దాడికి కూడా పాల్పడ్డారు. దీంతో ఎమ్మెల్యే పోలీసు స్టేషన్ వెళ్లి తలదాచుకోవాల్సి వచ్చింది. కానీ ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషియం తెలిశాక దిగ్బ్రాంతి పోయారు. కుమార్తె కిడ్నాప్ వ్యవహారంలో సుప్రభాత్ హస్తముందని తెలుసుకున్నారు. ఆయన్ను ఆయనకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. నియోజకవర్గంలో సానుభూతి పొందేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రతిష్ఠను దిగజార్చేందుకే సుప్రభాత్ కుమార్తె కిడ్నాప్ ప్లాన్ రచించాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.